News September 10, 2025

ఆ రైలుకు బేతంచెర్లలో స్టాపింగ్

image

కరోనా సమయంలో రద్దైన స్టాపింగ్‌లను ప్రయాణికుల సౌకర్యార్థం 137 స్టేషన్లలో పునరుద్ధరించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అందులో భాగంగా మచిలీపట్నం–యశ్వంత్‌పూర్ మధ్య నడిచే కొండవీడు రైలు (17211)కు ఈ నెల 10వ తేదీ నుంచి బేతంచర్ల స్టేషనులో రాత్రి 12:34 గంటలకు స్టాపింగ్ కల్పించారు. అదే విధంగా తిరుగు ప్రయాణం (17212)లో ఈ నెల 11వ తేదీ నుంచి బేతంచర్లలో రాత్రి 9:19 గంటలకు స్టాపింగ్ పునరుద్ధరించారు.

Similar News

News December 16, 2025

ఇప్పటివరకు IPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

image

*రూ.27 కోట్లు- రిషభ్ పంత్ (లక్నో)
*రూ.26.75 కోట్లు- శ్రేయస్ అయ్యర్ (పంజాబ్)
*రూ.25.20 కోట్లు- గ్రీన్ (కేకేఆర్)
*రూ.24.75 కోట్లు- స్టార్క్ (కేకేఆర్)
*రూ.23.75 కోట్లు- వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)
*రూ.20.50 కోట్లు- కమిన్స్ (SRH) *రూ.18.50 కోట్లు- సామ్ కరన్ (పంజాబ్) *రూ.18 కోట్లు- పతిరణ (కేకేఆర్), అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్), చాహల్ (పంజాబ్)

News December 16, 2025

42% రిజర్వేషన్ల సాధనకు పోరాడుతూనే ఉంటాం: సీతక్క

image

TG: బీసీ కులగణన ప్రకారం 42% రిజర్వేషన్ల సాధన టార్గెట్‌గా కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో 2 విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు కామెంట్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని హెచ్చరించారు.

News December 16, 2025

సర్పంచ్‌, వార్డు సభ్యులకు 20న ప్రమాణ స్వీకారం: జనగామ కలెక్టర్‌

image

జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఈ నెల 20వ తేదీన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు.