News December 1, 2025

ఆ వ్యాధి గురించి భయపడకండి: చిత్తూరు DMHO

image

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు స్కబ్ టైపన్ కేసులు 149 నమోదయ్యాయని.. అందరూ కోలుకున్నారని DMHO సుధారాణి వెల్లడించారు. చిన్న నల్లి లాంటి ప్రాణి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందన్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలిపారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇవి కుడుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే యాంటి బయోటిక్స్ ద్వారా నయమవుతుందని స్పష్టం చేశారు.

Similar News

News February 13, 2026

కుప్పంపై అధికారుల ప్రత్యేక దృష్టి

image

కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 20 గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడి అవకాశం ఉందని RWS అధికారులు అంచనా వేస్తున్నారు. 20 గ్రామాల్లో 10 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు, మరో 7 గ్రామాల్లో తాగునీరు, పశువులకు నీటి సరఫరా చేసేలా, మిగిలిన 5 గ్రామాలలో ప్రైవేట్ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులకు రూ.23.02 లక్షలు ఖర్చు చేయనున్నారు.

News February 13, 2026

చిత్తూరు: నీటి ఎద్దడి సమరం..అధికార యంత్రాంగం సన్నద్ధమా?

image

వేసవి ప్రారంభం కాకముందు ఎండలు మండుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం సగటు భూగర్భ నీటి మట్టం 8.04 మీటర్లు ఉండగా, గతేడాది 8.94 మీటర్లు ఉండేది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో, పలమనేరు, బైరెడ్డి మండలాల్లోని అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఎదుర్కొనే ప్రాంతాలపై RWS అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

News February 13, 2026

చిత్తూరు: 2.25 లక్షల రుద్రాక్షలతో మహా శివలింగం ఎక్కడో తెలుసా..

image

గుడిపల్లి (M) మల్లప్ప కొండపై నెలకొని ఉండు శ్రీ మల్లేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. మహాశివరాత్రి సందర్భంగా మల్లప్ప కొండపై 2.25 లక్షల రుద్రాక్షలతో భారీ శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి వేడుకలకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.