News March 13, 2025

ఇంకుడు గుంతల్లో భద్రాద్రి అగ్రస్థానంలో ఉండాలి: కలెక్టర్

image

పాల్వంచ: జల సంచయ్ జన్ భాగీదరి క్యాచ్ ద రైన్ అమలులో భాగంగా దేశంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంకుడు గుంత తవ్వకానికి యువకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, భవిష్యత్తు కాలంలో నీటి ఎద్దడి లేకుండా ఇంకుడు గుంతలు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 17, 2026

రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

image

AP: రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో పాలకవర్గం గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం ఏర్పడే వరకు వీరే పాలన చూసుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్‌కు జులై 29, మరో 13 పురపాలికల్లో నవంబర్ 21తో గడువు ముగియనుంది. అటు పంచాయతీల్లో APR 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.

News March 17, 2026

28న ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ ఛైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి అనకాపల్లి, అల్లూరి, విశాఖ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

News March 17, 2026

భద్రాద్రిలో భక్తులకు వైద్య భద్రత

image

భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లావైద్యఆరోగ్యశాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ నెల 26 నుంచి 28 వరకు భద్రాచలం, పర్ణశాల, సారపాకల్లో 10 ప్రథమ చికిత్స కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నారు. 40 మంది వైద్యులు, 147 మంది సిబ్బంది 24 గంటల పాటు సేవలందించనున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా 50 వేల ORS ప్యాకెట్లు సిద్ధం చేయగా, అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక వార్డులు, అంబులెన్సులను ఏర్పాటు చేశారు.