News March 4, 2025

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS అమలు: సీపీ

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని, సమావేశాలు, ర్యాలీలు, మైకుల వినియోగం నిషేధించామని తెలిపారు. పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశించారు.

Similar News

News December 5, 2025

కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

image

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.

News December 5, 2025

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో గర్భిణులకు తప్పని ప్రైవేటు బాట

image

ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఏడదిన్నరగా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ కీలక సేవలు అందడం లేదు. శిశువు ఎదుగుదల తెలుసుకోవాల్సిన గర్భిణులు చేసేది లేక రూ.4,000 వరకు చెల్లించి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్‌ను నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.

News December 5, 2025

కోతుల సమస్యలపై కార్యాచరణ రూపొందించాలి: కలెక్టర్

image

కోతుల సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని అటవీ శాఖ అధికారులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పోడు భూముల పట్టా ఉన్నవారు ఎవరైనా అడవి జంతువుల వేటకు పాల్పడిన, అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నించిన గతంలో జారీ చేసిన పట్టా రద్దు చేయాలని చెప్పారు. యువత, పిల్లలను ఆకర్షించేలా అర్బన్ పార్క్‌లో జంతువులను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డుపై ఎక్కడ కూడా కోతులకు ఆహార పదార్థాలు ఇవ్వవద్దని పేర్కొన్నారు.