News March 12, 2025
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు..399 మంది డుమ్మా..!

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. మంగళవారం ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు గణితం 1ఏ, వృక్షశాస్త్రం, పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌కు సంబంధించి 8,624 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 8,378 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2,096 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 153 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
Similar News
News March 16, 2025
నల్గొండ: DCCలకు పదవులు.. అధ్యక్ష పీఠంపై ఇంట్రస్ట్

డీసీసీ పదవికి భారీగా డిమాండ్ పెరిగింది. నల్గొండ DCCగా ఉన్న శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడంతో ఆ పదవికి పలువురు పోటీ పడుతున్నారు. సూర్యాపేట డీసీసీగా ఉన్న వెంకన్నను రైతు కమిషన్ సభ్యుడిగా నియమించింది. దీంతో ఇక్కడ కూడా డీసీసీ అధ్యక్ష పదవిపై పలువురి దృష్టి పడింది. సూర్యాపేట స్థానాన్ని జనరల్, యాదాద్రి జిల్లాకు ఎస్సీ లేదా జనరల్ కోటాలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం బ్రేక్

AP: కృష్ణా జలాలను రాయలసీమకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది. ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులూ చేపట్టవద్దని, తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని (35వేల క్యూసెక్కులు) తరలించేలా ఈ ఎత్తిపోతల పథకం చేపట్టారు. అనుమతులు నిరాకరించడంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ హర్షం వ్యక్తం చేశారు.