News March 8, 2025

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 491 మంది గైర్హాజరు 

image

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1బీ పరీక్షలకు 491 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి మొత్తం 13,379 మంది విద్యార్థులకు గాను 12,888 విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

Similar News

News January 23, 2026

పొన్నూరు విద్యార్థికి రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్

image

గుంటూరు జోనల్ స్థాయిలో గురువారం జరిగిన స్పెల్ బీ పోటీలలో పొన్నూరు విద్యార్థి పొట్లూరి దేవేశ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న దేవేశ్ జోనల్ స్థాయిలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయిలో 4వ తరగతి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో విద్యార్థి దేవేశ్‌ను మండల విద్యాశాఖ అధికారులు ధూపం రాజు, కొల్లి విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.

News January 23, 2026

బాపట్ల: గుడ్ న్యూస్.. రూ.50 వేల సబ్సిడీతో రుణాలు

image

జిల్లాలోని SC స్వయం సహాయక సంఘం సభ్యులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం అజయ్ పథకం కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు DRDA PD సింగయ్య గురువారం తెలిపారు. జిల్లాలో 183 మందికి లబ్ధి చేకూరనుందన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.50 వేల సబ్సిడీ, మిగతా మొత్తం వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. 20-35 ఏళ్ల వయసు ఉండి, కొత్త యూనిట్లు స్థాపించే వారు ఈనెల 24లోపు స్థానిక వెలుగు కార్యాలయలలో సంప్రదించాలని సూచించారు.

News January 23, 2026

MEGA 158లో చిరు సరసన ప్రియమణి!

image

చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు బాబీ డైరెక్షన్‌లో రాబోతున్న ‘మెగా 158’ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.