News March 14, 2025

ఇండియన్ గూగుల్‌లో చిత్రాడ ట్రెండింగ్

image

ఇండియన్ గూగుల్‌లో చిత్రాడ గ్రామం ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు రాష్ట్రం యావత్తు చిత్రాడ వైపు చూస్తుంది. చిత్రాడ గ్రామం ఎక్కడా అని గూగుల్‌లో సెర్చ్ చేస్తోంది. ఇక్కడికి సులభంగా చేరుకోవడానికి మార్గాలను నెటిజన్లు వెతుకుతున్నారు. దీనికి కారణం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం చిత్రాడలో జరగడమే. చిత్రాడ, పిఠాపురం, కాకినాడ, అన్నవరం, తుని ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు ఆన్‌లైన్‌లో బుక్ అయిపోయాయి.

Similar News

News February 7, 2026

వంటింటి చిట్కాలు

image

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. * సింక్ గొట్టంలో ఆహార వ్యర్థాలు ఇరుక్కుపోయి దుర్వాసన వస్తుంటే బేకింగ్ సోడాను వేడినీళ్ళలో కలిపి పోస్తే సమస్య పరిష్కారమవుతుంది. * కొబ్బరిపాలు కొన్ని గంటలపాటు తాజాగా ఉండాలంటే చిటికెడు ఉప్పు కలపండి. * కొత్తిమీర కాడల్ని కత్తిరించి ఆ ఆకులకు నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

News February 7, 2026

సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా నివేదిత

image

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టర్ మురిశెట్టి లక్ష్మభి భార్య నివేదితను ఛైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి సన్నిహితుడైన లక్ష్మభి, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసమే పార్టీ మారి ఈ ‘బంపర్ ఆఫర్’ కొట్టేశారన్న చర్చ నడుస్తోంది. రాజకీయ అనుభవం లేకున్నా ఆమెకు టికెట్ దక్కడం స్థానికంగా రాజకీయ వేడిని పెంచుతోంది.

News February 7, 2026

మలేషియాకు బయలుదేరిన మోదీ

image

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ మలేషియా బయలుదేరారు. పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర తీర సహకారంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. అలాగే మలేషియాలోని భారతీయులను ప్రధాని ప్రత్యేకంగా కలవనున్నారు. కాగా మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.