News August 11, 2025

ఇండియాలోనే ఫస్ట్.. మన HYDలో ఇక Automatic

image

నాంపల్లిలో ప్రపంచంలోనే అరుదుగా ఉండే పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ సిద్ధమవుతోంది. వాహనాలను ఎటువంటి కోణంలో విడిచి పెట్టి వెళ్లినా 360 డిగ్రీలు తిరిగే ప్యాలిస్ టేబుల్ సరైన విధానంలో పార్కింగ్ చేస్తుంది. ఇక్కడ 250 కార్లను ఏకకాలంలో పార్కింగ్ చేయవచ్చు. జర్మనీ టెక్నాలజీతో ఈ పార్కింగ్‌ వ్యవస్థని సిద్ధం చేస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.
SHARE IT

Similar News

News March 10, 2026

నిర్వాసితులకు అండగా ఉంటాం: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులందరికీ ప్రభుత్వం తరపున పూర్తి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. వారికి ఇంటి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. క్రషర్ వివాదంపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అసత్య ప్రచారాలు చేసే వారికి అసెంబ్లీ సాక్షిగా గట్టి సమాధానం చెబుతానని మంత్రి హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

News March 10, 2026

HYD: అర్ధరాత్రి సందడే.. సందడి!

image

రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో HYDలో పది రోజుల పాటు సందడి నెలకొననుంది. చార్మినార్, టోలిచౌకి, పాతబస్తీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నైట్ బజార్లకు నగర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో అర్ధరాత్రి వేళ కూడా ఆ వీధులన్నీ షాపింగ్ ప్రియులతో కళకళలాడుతున్నాయి. పాతబస్తీలో వ్యాపారాలు జోరందుకోగా, పెరిగిన వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.