News November 19, 2025
ఇండియా ఘన విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు రెండో విజయం సాధించింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 135-7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఓపెనర్లు వైభవ్(12), ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపరిచినా, హర్ష్ దూబే(53*), నమన్ ధిర్(30) రాణించారు. దీంతో ఇండియా-ఏ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
Similar News
News January 17, 2026
162 పోస్టులకు NABARD నోటిఫికేషన్ విడుదల

<
News January 17, 2026
మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు

TG: రాష్ట్రంలో 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 38, SC 17, ST 5, జనరల్ కి 61 స్థానాలు కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్, కేసముద్రం, ఎల్లంపేట్ ఉన్నాయి. ఎస్సీ జనరల్ కేటగిరీలో స్టేషన్ ఘన్‌పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్షెట్టిపేట, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహిర్, హుస్నాబాద్ ఉన్నాయి. పూర్తి వివరాలకు పైన ఫొటోలను స్లైడ్ చేయండి.
News January 17, 2026
ఇండోర్‌లో కలుషిత నీరు.. రూ.3 లక్షల మెషీన్ తెచ్చుకున్న గిల్

ఇండోర్ (MP)లో <<18729199>>కలుషిత నీటితో<<>> 24 మంది మరణించడంతో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ గిల్ అప్రమత్తమయ్యారు. రూ.3 లక్షల విలువైన స్పెషల్ వాటర్ ప్యూరిఫికేషన్ మెషీన్‌ను తన వెంట తీసుకెళ్లారు. ఈ మెషీన్ RO, ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ నీటినీ శుద్ధి చేయగలదని నేషనల్ మీడియా పేర్కొంది. దాన్ని గిల్ తన గదిలో ఉంచుకోనున్నట్లు చెప్పింది. కాగా రేపు ఇండోర్‌లో భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే జరగనుంది.


