News November 19, 2025
ఇండియా ఘన విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు రెండో విజయం సాధించింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 135-7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఓపెనర్లు వైభవ్(12), ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపరిచినా, హర్ష్ దూబే(53*), నమన్ ధిర్(30) రాణించారు. దీంతో ఇండియా-ఏ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
Similar News
News January 14, 2026
ఉదయాన్నే అలసటగా అనిపిస్తుందా?

ఉదయం నిద్రలేవగానే శరీరం బరువుగా, అలసటగా అనిపిస్తే అది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదు. నిద్ర సరిపోకపోవడం, శరీరంలో నీరు తగ్గడం, విటమిన్-D లోపం, మానసిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివి ఇందుకు కారణమవుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రోజూ గోరువెచ్చని నీరు తాగడం, సరైన నిద్ర, ఉదయం ఎండలో కూర్చోవడం, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. అయినా అలసట తగ్గకపోతే వైద్య సలహా తప్పనిసరి.
News January 14, 2026
అమెరికాలో 51వ రాష్ట్రం అవ్వనున్న గ్రీన్‌లాండ్!

డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే బిల్లును US కాంగ్రెస్‌లో రిపబ్లికన్ మెంబర్ ర్యాండీ ఫైన్ ప్రవేశపెట్టారు. ‘గ్రీన్‌లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్‌హుడ్’ బిల్లు ఆమోదం పొందితే, ఆ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేసుకునే అధికారం ట్రంప్‌కు లభిస్తుంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా అయినా దక్కించుకుంటామని <<18784880>>ట్రంప్<<>> ఇప్పటికే స్పష్టం చేశారు.
News January 14, 2026
సంక్రాంతి పురుషుడి గురించి తెలుసా?

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో గోచరించే రూపమే ‘సంక్రాంతి పురుషుడు’. ప్రతి ఏడాది ఆయన ఓ ప్రత్యేక వాహనంపై, విభిన్న వస్త్రాలు, ఆభరణాలతో వస్తాడని పంచాంగం చెబుతుంది. ఆయన ధరించే వస్తువులు, చేసే పనులను బట్టి ఆ ఏడాది దేశంలో వర్షాలు, పంటలు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ మార్పులు ఎలా ఉంటాయో జ్యోతిషులు అంచనా వేస్తారు. సంక్రాంతి పురుషుడి ఆగమనం ప్రకృతిలో వచ్చే మార్పులకు, భవిష్యత్తుకు సూచికగా భావిస్తారు.


