News September 9, 2025

ఇందిరమ్మ ఇళ్లకు నగదు త్వరగా జమయ్యేలా చూడాలి: కలెక్టర్

image

అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ, అంగన్వాడీ, పంచాయతీ భవనాల నిర్మాణాలపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల ఆన్‌లైన్ నమోదు వేగవంతం చేసి లబ్ధిదారులకు త్వరగా నగదు జమ చేయాలన్నారు. SHG రుణ లక్ష్యం చేరుకోవాలని, వారంవారం మండల కమిటీ సమావేశాలు జరిపి జిల్లా, రాష్ట్రంలో ముందంజలో నిలిచేలా చూడాలని కోరారు.

Similar News

News December 7, 2025

కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు ఇలా…!

image

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మాంసం ధరల వివరాలను వ్యాపారులు ప్రకటించారు. కిలో పొట్టేలు మటన్ ధర రూ. 800గా ఉంది. కిలో చికెన్ ధర రూ. 260 చొప్పున విక్రయిస్తుండగా, లైవ్ కోడి కిలో రూ. 160 పలుకుతోంది. గత వారంతో పోలిస్తే, చికెన్ ధర కిలోకు రూ. 10 పెరిగింది. అయితే, మటన్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పెరిగిన చికెన్ ధరతో మాంసాహార ప్రియులు కొంత నిరాశ చెందారు.

News December 7, 2025

రోహిత్, కోహ్లీలకు గంభీర్ షాక్!

image

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన సిరీసుల్లో రాణించినప్పటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. విరాట్, రోహిత్ శర్మలు 2027 WC ఆడటంపై గ్యారంటీ ఇవ్వలేదు. వారిద్దరూ 2027 ప్రపంచకప్ ఆడతారా అని జర్నలిస్టులు అడగ్గా.. ‘వన్డే ప్రపంచకప్ మరో రెండేళ్లు ఉందని మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. యంగ్ ప్లేయర్లు చక్కగా ఆడుతూ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.

News December 7, 2025

కొవ్వూరు బీజేపీలో ఆధిపత్య పోరు

image

కొవ్వూరు BJPలో ఆధిపత్య పోరు ఉందని ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పరిమి రాధాకృష్ణ మధ్య సఖ్యత లోపించిందని క్యాడర్ గుసగుసలాడుతోంది. తాజాగా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో రెండు హాల్టుల పునరుద్ధరణపై ఇరువురు నేతలు తమ మద్దతుదారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణకు మారుపేరైన BJPలో ఇలాంటి పరిస్థితి ఏంటని కార్యకర్తలు వాపోతున్నారు.