News November 6, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: పెద్దపల్లి కలెక్టర్

image

మంథని నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్కింగ్ చేసిన ఇళ్లు, బేస్మెంట్ స్థాయికి చేరుకునేలా పనులు వేగవంతం చేయాలని, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లు రద్దు చేయాలని ఆదేశించారు. పెట్టుబడి సమస్యలుంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని సూచించారు. నిర్మాణ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 17, 2026

వనపర్తి: భార్య చేతిలో భర్త దారుణ హత్య

image

గోపాల్‌పేట మండల పరిధిలోని ఏదుట్లలో అనుమానంతో వేధిస్తున్నాడన్న కోపంతో భార్య తన భర్తను హతమార్చిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నమల్లయ్య (40), శివమ్మ దంపతుల మధ్య వివాహేతర విషయమై తరచూ గొడవలు జరుగుతుండేవి. నిన్న రాత్రి మరోసారి గొడవ ముదరడంతో శివమ్మ ఆవేశంలో పారతో తలపై బలంగా కొట్టింది. అక్కడికక్కడే మృతి చెందాడు. వనపర్తి DSP, CI ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

News January 17, 2026

కాకినాడలో జాబ్ మేళా.. ఎప్పుడంటే..!

image

కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం వద్ద ఈ నెల 19న సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ PD లచ్చారావు శనివారం తెలిపారు. పదో తరగతి నుంచి ఆపై విద్యార్హతలు కలిగి, 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ ధ్రువీకరణ పత్రాలతో సోమవారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 17, 2026

గొల్లప్రోలులో కోర్టు సినిమా హీరోయిన్ సందడి

image

గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని ప్రసిద్ధ అపర్ణాదేవి ఆలయాన్ని శనివారం కోర్టు సినిమా ఫేమ్ శ్రీదేవి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు ఆకొండి ప్రభాకర్ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆమె కుంకుమ పూజలు చేశారు. పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు హీరోయిన్‌ను ఘనంగా సత్కరించారు. శ్రీదేవి రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.