News September 10, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 16, 2025
ఉప సర్పంచ్‌గా మెదక్ ఎంపీ కారు డ్రైవర్

మెదక్ MP రఘునందన్ రావు కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాయి చరణ్ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో మొదటి వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత గ్రామంలోని వార్డు సభ్యుల సహకారంతో ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు సాయి చరణ్‌ను అభినందించారు.
News December 16, 2025
IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
News December 16, 2025
విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

విశాఖలో మంత్రి లోకేశ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన తనకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని సతీశ్వరరెడ్డి కోరారు. కోనసీమ, పోలవరంలో గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలనీ కోరారు.


