News February 10, 2025

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం సర్వతోముఖాభివృద్ధి: మంత్రి

image

గత పదేళ్ల BRS పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యమైయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తిలో పలు గ్రామాల్లో పర్యటించి వారు మాట్లాడారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు. గ్రామాల అభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి తీరుతామని తెలిపారు.

Similar News

News February 13, 2026

కీలకం కానున్న MLA, MLC, MPల ఓట్లు

image

TG: మున్సి‘పోల్స్’ ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా ఉన్న చోట్ల ఛైర్మన్, మేయర్ ఎంపికలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా MLA, MLC, MPల ఓట్లు కీలకం కానున్నాయి. రాజ్యసభ సభ్యులు, MLCలు రాష్ట్రంలో ఎక్కడైనా తమ ఓటు వినియోగించుకొనేందుకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అదే లోక్‌సభ సభ్యులు, MLAలు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక మున్సిపాల్టీలో మాత్రమే ఓటేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

News February 13, 2026

BIG BREAKING: కొత్తగూడెంలో ఎవరికీ దక్కని మెజారిటీ

image

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠకు తెరపడింది. మొత్తం 60 డివిజన్లకు గానూ లెక్కింపు పూర్తి కాగా, కార్పొరేషన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన ‘మ్యాజిక్ ఫిగర్'(31) ఏ ఒక్క పార్టీకి లభించలేదు. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్‌ఎస్‌ 8, BJP 1, సీపీఎం 1, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ‘కింగ్ మేకర్’గా మారిన BRS, స్వతంత్రుల నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది.

News February 13, 2026

నీళ్లపై చర్చలకు మేము సిద్ధం: చంద్రబాబు

image

AP: నీటి సమస్యపై 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని CM CBN స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను AP అడ్డుకుంటోందన్న TG CM రేవంత్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో చంద్రబాబు స్పందించారు. ‘APలోని నల్లమల సాగర్‌ను TG అడ్డుకోవడం సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేం సపోర్ట్ చేశాం. 5000 TMCల గోదావరి నీరు వృథాగా పోతోంది. కృష్ణాలోనూ నీటి వృథా ఉంది. సమస్యలపై చర్చకు మేము సిద్ధం’ అని పేర్కొన్నారు.