News November 7, 2025
ఇకపై శ్రీవారి అంగప్రదక్షిణానికి ఆన్‌లైన్ టోకెన్లు

తిరుమలలో ఇకపై అంగప్రదక్షిణం టోకెన్లను ముందు వచ్చిన వారికి ఆన్‌లైన్‌లో కేటాయించనున్నట్లు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ పద్ధతి వచ్చే ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఈ నెల 17 నుంచి 25 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని, అమరావతిలోని ఎస్వీ ఆలయం పనులు 27న ప్రారంభమవుతాయని తెలిపారు.
Similar News
News January 14, 2026
తెలుగు సాంప్రదాయాలను కాపాడాలి: ఎమ్మెల్యే బేబినాయన

తెలుగు సంప్రదాయాలను కాపాడాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బాడంగి మండలం గజరాయునివలసలో బుధవారం ఎద్దులతో బండ లాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైతులకు బండ లాగుడు పందెం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 15 గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.
News January 14, 2026
KCRను తిట్టేందుకు కవిత చాలు: కోమటిరెడ్డి

TG: BRS, KCRను విమర్శించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘BRS, KCRను తిట్టేందుకు ఆయన కుమార్తె కవిత చాలు. KCR ₹7లక్షల కోట్ల అప్పు చేస్తే వాటిని చెల్లిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. బంగారు తెలంగాణ చేశామని చెప్పిన KCR అధికారం కోల్పోయిన 6నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఒక్క సీటూ సాధించలేదు. ఆ పార్టీ గురించి ప్రజలు చూసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.
News January 14, 2026
ఇరాన్‌పై అమెరికా ఎందుకు అటాక్ చేయట్లేదంటే..

ఇరాన్ పాలకులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మండిపడుతున్నారు కానీ మిలిటరీ అటాక్ చేయట్లేదు. దీనికి ముఖ్య కారణం.. OCT నుంచి మిడిల్ ఈస్ట్‌లో US ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేకపోవడమే. ఏదైనా మిస్సైల్, ఎయిర్ అటాక్ చేయాలంటే ఖతర్, బహ్రెయిన్, ఇరాక్, సౌదీ, యూఏఈలోని బేస్‌లను వాడుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది కాబట్టి అందుకు ఆ దేశాలు ఒప్పుకోవు. ఒకవేళ B2 బాంబర్లు వాడితే భారీగా పౌరులు మరణిస్తారు.


