News December 11, 2025

ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

image

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.

Similar News

News January 19, 2026

ఎన్నికల విధుల్లో వారికి మినహాయింపు: ADB కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సంబంధిత నోడల్ అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపు, లాజిస్టిక్స్ అంశాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులకు గర్భిణీలు, బాలింతలు, దివ్యాంగులు, అలాగే వచ్చే మార్చి నెలాఖరు నాటికి పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు.

News January 17, 2026

ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ బదిలీ

image

ఉట్నూర్ అదనపు ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కాజల్ సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీలు చేపడుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ కాజల్ సింగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీగా బదిలీ చేశారు. కొంత కాలంగా ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న ఆమె పలు కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు.

News January 17, 2026

ఆదిలాబాద్: భక్తుల ఇంటికే మేడారం ప్రసాదం

image

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని భక్తుల ఇంటికే ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి ADB ఆర్టీసీ ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు tgsrtcologistics.co.in వెబ్ సైట్, ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు.