News August 11, 2025
ఇచ్చోడ: ‘వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి’

వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని షీటీం ASI వాణిశ్రీ విద్యార్థినులకు సూచించారు. సోమవారం ఇచ్చోడ ప్రభుత్వ Jr కళాశాల, ఉన్నత పాఠశాలల్లో షీటీం సేవలపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం షీటీం పనిచేస్తుందన్నారు. సమస్య ఉంటే 8712659953కి కాల్ చేయాలని సూచించారు. షీటీం సిబ్బంది మహేశ్, మోహన్, రోహిణి పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై వీడని ఉత్కంఠ

ADB విమానాశ్రయ భూసేకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. బ్లూప్రింట్ సిద్ధమైందని నేతలు చెబుతుండగా, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కలెక్టర్ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. రన్‌వే విస్తరణకు 249.81 ఎకరాలు అవసరం కానుంది. దీంతో భూములు ఎటువైపు పోతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనతో బాధితుల్లో భయం పెరిగింది. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
News March 13, 2026
14న ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం : ADB కలెక్టర్

జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 14న కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.