News March 16, 2025
ఇచ్ఛాపురం: కరెంటు స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

ఇచ్ఛాపురం మండలం కొలిగాం గ్రామ సమీప మలుపు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్‌కు చెందిన రాజేశ్ ఓ ఇటుకుల కంపెనీలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని మరో వ్యక్తితో బైక్‌పై అతివేగంగా వస్తూ.. కరెంటు స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News February 13, 2026
శ్రీకాకుళం: నేడు ప్రపంచ రేడియో దినోత్సవం

ఆకాశవాణి.. అంటూ గగనతలం నుంచి సాగిన అదృశ్యవాణి ఒక తరానికి తీరని జ్ఞాపకం. టీవీలు, సెల్ ఫోన్లు రాకముందు రేడియో ఒక అద్భుతమైన స్నేహితుడు. పాటలు, కథలు, న్యూస్, వినోదం ఇలా ఎన్నో రకాల సేవలు అందించే ఈ రేడియో నేటి తరానికి తెలియదు. సమాచార విప్లవం తర్వాత కూడా ఎఫ్.ఎమ్ అంటూ సందడి చేసింది. నేడు ప్రపంచ రేడియో దినోత్సవం.
News February 13, 2026
మందస: రాజవంశీయుడు కన్నుమూత

మందస రాజవంశీయులు కేసరి సింగ్ దేవ్ (79) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లోని ఖార్వేలా నగర్‌లో స్వగృహంలో కన్నుమూశారు. కేసరి సింగ్ దేవ్ గతంలో టెరిటోరియల్ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఈయన మృతితో మందసలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సంస్థానానికి చివరి రాజు అయిన రాజమణి రాజ్ దేవ్ ద్వితీయ కుమారుడే కేసరి సింగ్ దేవ్.
News February 13, 2026
తెల్లవారుజామున 3 గం.ల నుంచే శ్రీముఖలింగేశ్వరుడి దర్శనాలు

జలుమూరు మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈనెల 15-18 వరకు జరగన్నాయి. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 2 గం.లకు సుప్రభాత సేవ నిర్వహించి, 3 గం.ల నుంచే స్వామి దర్శనం భక్తులకు కల్పిస్తామని ఈవో కొండలరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 7 గం.లకు శిఖర దీపం, 10గం.లకు లింగోద్భవం, అర్ధరాత్రి 12 గం.లకు తిరువీధి కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లను చేశామన్నారు.


