News April 15, 2024

ఇడుపులపాయ: IIITలో విద్యార్థి ఆత్మహత్య

image

ఇడుపులపాయలోని IIITలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. మెకానికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సురేఖ హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన IIIT అధికారులు ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సురేఖ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థి ప్రకాశం జిల్లా జంగం గుంట్ల గ్రామానికి చెందిన అమ్మాయిగా గుర్తించారు. వివరాలు

Similar News

News December 6, 2025

వైవీయులో పీజీ ప్రవేశాలకు 8 నుంచి స్పాట్ అడ్మిషన్లు

image

కడప: YVU P.G (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాలను ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ అఫ్ అడ్మిషన్స్ డా. టి. లక్ష్మీప్రసాద్ తెలిపారు. విద్యార్థులు బరిజనల్ సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజుతో వైవీయులోని డీవోఏ ఆఫీసులో సంప్రదించాలన్నారు. ఏపీ పీజీ సెట్ రాయని వారు కూడా రావచ్చన్నారు. వివరాలకు
yvu.edu.in ను సంప్రదించాలని సూచించారు.

News December 6, 2025

క్రికెటర్ శ్రీచరణి తండ్రికి రూ.5 లక్షల చెక్కు అందజేత

image

కడప క్రికెట్ తేజం నల్లపురెడ్డి శ్రీచరణికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా ప్రకటించిన రూ.5 లక్షల ప్రోత్సాహక చెక్కును శనివారం MLA మాధవి, క్రికెట్ స్టేడియం ఛైర్మన్ శ్రావణ్ రాజ్‌రెడ్డి కలిసి ఆమె తండ్రికి అందజేశారు. మహిళా క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కడపకు గర్వకారణమై నిలిచిన శ్రీచరణిని అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

News December 6, 2025

అన్నమయ్య కాలిబాట విషయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం పిల్లి: శ్యామల

image

అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొమరం పులే గాని కాలిబాట విషయంలో పిఠాపురం పిల్లిలా ప్రవర్తించారని YCP రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శ్యామల తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం నడింపల్లికి చేరుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాదయాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు విధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని విమర్శించారు.