News November 17, 2025

ఇతరులను విమర్శించొద్దు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో..

image

వివిధ సందర్భాల్లో పుట్టపర్తి సత్యసాయి బాబా చెప్పిన సూక్తులు..
★ అడ్డంకులు ఎదురైనప్పుడు, వాటిని పరీక్షలుగా భావించాలి
★ మితంగా తిని, దీర్ఘకాలం జీవించండి. ఎన్నో యుగాలుగా ఋషుల నుంచి మనకు అందిన సలహా ఇది
★ ఇతరులను విమర్శించొద్దు. దానికి బదులు నిన్ను నువ్వే విమర్శించుకో, ప్రశ్నించుకో
★ అందరిలోనూ దైవాన్ని చూడు. నువ్వు ఎవరికి నమస్కరించినా, అది చివరకు ఆ భగవంతుడికే చేరుతుంది.
#సత్యసాయి శత జయంతి

Similar News

News January 13, 2026

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
> జనగామ: మున్సిపల్ ఓటర్ జాబితా విడుదల
> జనగామ జిల్లాలో తీసేసి యోచనలో ప్రభుత్వం ఉంది: ఎమ్మెల్యే
> చింతగట్టు జాతరపై ఎమ్మార్వో సమీక్ష సమావేశం
> రాష్ట్రంలో పనిచేసే సీఎం ఉన్నారు: కడియం
> దేవరుప్పులలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ
> రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి: కలెక్టర్
> యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: కలెక్టర్

News January 13, 2026

సిద్దిపేట: డిస్పోజల్ ప్రక్రియ వేగవంతం చేయండి: కలెక్టర్

image

భూ భారతి అవగాహన సదస్సులలో మండలాల్లో స్వీకరించిన దరఖాస్తుల డిస్పోజల్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం ఆర్డీవోలు, తహశీల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. అలాగే బీఎల్ఒలు ఎలక్ట్రోల్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

News January 13, 2026

మేడారంలో రాత్రి షిఫ్ట్ పనులు పరిశీలించిన కలెక్టర్

image

సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ దివాకర మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ రాత్రి షిఫ్ట్‌లో జరుగుతున్న క్యూలైన్, ఆలయ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ట్రైనీ ఆర్డీఓ, ఆర్ అండ్ బీ ఈఈ సురేశ్ పాల్గొన్నారు.