News November 30, 2025
ఇతిహాసాలు క్విజ్ – 82 సమాధానాలు

నేటి ప్రశ్న: సూర్యుడిని భానుడు అని ఎందుకు అంటారు?
సమాధానం: సంస్కృతంలో ‘భాను’ అంటే కాంతి, ప్రకాశం, వెలుగు అని అర్థం. సూర్యుడు సమస్త ప్రపంచానికి అంధకారాన్ని తొలగించి, నిత్యం వెలుగును, శక్తిని ప్రసాదిస్తాడు. అందుకే, సూర్యుడిని ప్రకాశాన్ని ఇచ్చేవాడు (భాస్కరుడు, భానుడు) అని కీర్తిస్తారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News February 7, 2026
బంధం విఫలం అవ్వడం మీ తప్పు కాదు

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ తప్పుల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
News February 7, 2026
రూ.20 లంచం.. 30ఏళ్ల పోరాటంలో విజయం.. అంతలోనే విషాదం

₹20 లంచం ఆరోపణలపై 30ఏళ్లు పోరాడి గెలిచిన రిటైర్డ్ కానిస్టేబుల్ ఆ మరుసటి రోజే తనువు చాలించారు. గుజరాత్ అహ్మదాబాద్ వేజల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేసిన బాబుభాయ్ ప్రజాపతిపై 1996లో లంచం కేసు నమోదైంది. విచారణలో దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు 2004లో 4ఏళ్ల జైలు శిక్ష, ₹3K ఫైన్ వేసింది. ఆ తీర్పును హైకోర్టులో సవాలు చేయగా సాక్షుల వాంగ్మూలంలో పొంతన లేకపోవడంతో తాజాగా నిర్దోషిగా తేల్చింది.
News February 7, 2026
PGIMER 59పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఛండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ 59 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 16వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI, సంబంధిత డిప్లొమా, డిగ్రీ, PG, MBA, BE/BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గ్రూప్ A పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ B, C పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. https://pgimer.edu.in/


