News August 14, 2025
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం: హరీశ్ రావు

‘రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దిందా పోడు రైతుల అక్రమ అరెస్టులను అడ్డుకున్న BRS రాష్ట్ర నాయకుడు ప్రవీణ్ కుమార్, ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతన్నలకు మద్దతు తెలపడమే BRS నాయకులు చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
Similar News
News March 16, 2026
మెదక్: తీవ్ర విషాదం.. పరీక్షకు వెళ్తూ మృతి

మనోహరాబాద్ మండలంలో ఆదివారం <<19387134>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఓ కంటైనర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇమాంపూర్ వాసి నిఖిల్(20) అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు మన్నె స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు బైక్‌పై ఉప్పల్‌లో పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 16, 2026
INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.
News March 16, 2026
కర్ణాటక తరలిపోతున్న పెద్దేముల్ సంపద!

పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్, రాంసింగ్ తండా తదితర ప్రాంతాల్లో ఎర్రరాయి అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు సహజమైన సంపదను దోచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రరాయిని వెలికితీసి కర్ణాటకకు తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.


