News March 14, 2025

ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతి  

image

ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మణికుమార్ అనే వ్యక్తి విద్యుత్ ఉద్యోగిగా గుర్తించామన్నారు. కుటుంబ కలహాలతో వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ కాలువలో దూకి మృతిచెందాడని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 13, 2026

సిరిసిల్ల: మనమరాలి ఫోటో చూస్తూ కుప్పకూలిన తాత

image

తన కుమారుడి కూతురి దశదినకర్మకు వచ్చిన తాత హఠాత్తుగా మృతి చెందిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. కోనేటి ఎల్లయ్య (80).. పెద్ద కుమారుడు పోచయ్య కూతురు శిరీష కరీంనగర్‌లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. ఈరోజు మండల కేంద్రంలో ఆమె దశదినకర్మ నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లయ్య, మనమరాలి ఫోటో చూస్తూ ఒక్కసారి కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు.

News February 13, 2026

BREAKING: మహబూబాబాద్‌లో హంగ్.. CONGRESS 13, BRS 12

image

మహబూబాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉండగా కాంగ్రెస్ 13, BRS 12, CPI 3, CPM 3, ఇండిపెండెంట్ 4, BJP 1 స్థానంలో గెలిచింది. కాగా మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 19 ఏ పార్టీ సాధించకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో మహబూబాబాద్‌లో ఏం జరుగుతుందోనని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

News February 13, 2026

కామారెడ్డి: పరాజయం పాలైన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు

image

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 31వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ ఘోర పరాజయం పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి అజీజ్ హుస్సేన్, ఇండిపెండెంట్ అభ్యర్థి సత్య ప్రకాశ్‌పై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పాక జ్ఞానేశ్వరి మూడో స్థానంలో నిలిచారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహంలో ఉన్నారు.