News November 19, 2025
ఇలాంటి ఇడియట్‌తో జాగ్రత్త: శ్రియా

తన ఫొటో, పేరును ఉపయోగించుకుని ఓ దుండగుడు ఇండస్ట్రీ వ్యక్తులకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతున్నాడంటూ హీరోయిన్ శ్రియా మండిపడ్డారు. ఆ నంబర్ తనది కాదని, ఈ ఇడియట్‌తో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఇలాంటివారితో జాగ్రత్తగా ఉండాలని తన స్నేహితులకు సూచించారు. కాగా ఇటీవల <<18304783>>అదితీ రావు హైదరీకి<<>> కూడా ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే.
Similar News
News January 16, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 16, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.26 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 16, 2026
ఉద్రిక్తతల వేళ.. భారతీయులకు అలర్ట్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. అవసరం లేని ప్రయాణాలు చేయొద్దని విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో భారత ఎంబసీ హెల్ప్‌లైన్ నెంబర్లను (+972-54-7520711, +972-54-3278392) సంప్రదించాలని పేర్కొంది. మరోవైపు ఇరాన్‌లోని భారతీయులను (10,000 మంది) స్వదేశానికి తరలించే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభిస్తోంది.
News January 16, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


