News November 5, 2025

ఇవాళ రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

image

ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. దీంతో సాధారణం కంటే 14% పెద్దగా, 30% అధిక కాంతివంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తున్నారు. మన దేశంలో రా.6.49 గంటలకు పూర్ణచంద్రుడు దర్శనమిస్తాడు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది.

Similar News

News January 17, 2026

రేవంత్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు: KTR

image

TG: సీఎం రేవంత్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని KTR విమర్శించారు. ‘సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోంది. SEC కార్పొరేషన్ సాధనకు ర్యాలీ నిర్వహించాలనుకుంటే మా నేతలను నిర్బంధించారు. కోర్టు ద్వారా అనుమతి తీసుకొని ర్యాలీ చేస్తాం. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం’ అని అన్నారు. అటు SECకు చెందిన నార్త్ జోన్ ప్రాంతాలను మల్కాజిగిరి పరిధిలో కలపడం అన్యాయమని BRS ఆరోపిస్తోంది.

News January 17, 2026

ప్రేమను పెంచే సింపుల్ ట్రిక్!

image

దంపతుల మధ్య చిలిపి తగాదాలు, ఒకరినొకరు ఆటపట్టించుకోవడం వల్ల వారి బంధం మరింత బలపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సరదా టీజింగ్స్.. భాగస్వాముల మధ్య ఉన్న భయాన్ని పోగొట్టి, చనువును పెంచుతుంది. ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, గొడవలను కూడా నవ్వుతూ పరిష్కరించుకోవచ్చు. అయితే ఈ హాస్యం కేవలం ఆనందం కోసమే ఉండాలి తప్ప, అవతలి వ్యక్తిని కించపరిచేలా ఉండకూడదు. share it

News January 17, 2026

నితీశ్ రెడ్డి ఆల్‌రౌండర్ కాదు: కైఫ్

image

NZతో ODI సిరీస్‌లో IND పిచ్‌కి తగ్గట్టు ప్లేయింగ్-11ని ఎంపిక చేయట్లేదని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. జట్టులో నితీశ్ రోల్ ఏంటో అర్థం కావడం లేదని తన YouTube వీడియోలో చెప్పుకొచ్చారు. ‘నితీశ్ ఆల్‌రౌండర్ కాదు. అతను బ్యాటర్ మాత్రమే. ఈ విషయాన్ని మేనేజ్‌మెంట్ వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి. అతడిని బ్యాటర్‌గా డెవలప్ చేయాలి. పార్ట్ టైమ్ బౌలర్‌ను ఆల్‌రౌండర్ అనడం కరెక్ట్ కాదు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.