News September 10, 2025

ఇసుక బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జగిత్యాల కలెక్టర్

image

జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఇసుక బజారును జగిత్యాల పరిసర ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మాత్రమే ఇసుక రిచ్ ఉన్న నేపథ్యంలో జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఇసుక కొనుగోలు చేయడం భారంగా మారిందని, దీంతో ప్రభుత్వం జగిత్యాలలో మూడున్నర ఎకరాల్లో ఇసుక బజార్ ఏర్పాటు చేశామన్నారు. 800 చలనా చెల్లించి ఇసుక పొందాలన్నారు.

Similar News

News December 17, 2025

SRCL: లక్ష్మీనరసింహస్వామికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర అందజేత

image

సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతం సృష్టించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకించి అగ్గిపెట్టెలో ఇమిడే రెండు గ్రాముల బంగారు చీరను మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో వెంకటస్వామికి అందించారు. దీని పొడవు 5:30 మీటర్లు వెడల్పు 48 ఇంచులు దీనిని తయారు చేయుటకు వారం రోజుల వ్యవధి పట్టిందన్నారు. ఈ సందర్భంగా నల్ల విజయ్‌కు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.

News December 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 17, 2025

GDK: ధనుర్మాసంలో పంచరామాలకు ప్రత్యేక బస్సు

image

GDK నుంచి పంచరామాలకు 4 రోజుల యాత్ర ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో పంచారామాలతో పాటు అన్నవరం, సింహాచలం, RK బీచ్, విజయవాడ, అమరావతి దర్శనాలు ఉంటాయి. ఈ యాత్ర DEC 25న ప్రారంభమై 29న ముగుస్తుంది. ఒక్కరికి ఛార్జీ రూ.4200గా ఉంటుందని DM నాగభూషణం తెలిపారు. భోజన, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాలని, టికెట్ బుకింగ్స్, మరిన్ని వివరాలకు 7382847596, 7013504982 నంబర్లను సంప్రదించాలని సూచించారు.