News November 10, 2024
ఇస్తాంబుల్ సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. ప్రపంచ పర్యావరణ మార్పులు.. వాటి పరిణామాలపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇందులో ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గ్రీన్ జోన్లలో మరింత పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాలపై చర్చలు జరిగాయి.
Similar News
News December 8, 2024
రాయచోటి ప్రశాంతంగా ఉండేందుకు సహకరించాలి: మంత్రి
రాయచోటి పట్టణం ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముస్లిం, హిందూ సోదరులు సోదర భావంతో ముందుకు వెళ్లాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రాయచోటిలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పట్టణంలో ఎవరైనా ప్రజలను రెచ్చగొట్టిన అల్లర్లకు పాల్పడినా, ప్రేరేపించినా ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 7, 2024
కడపలో Pic Of The Day
పేరెంట్- టీచర్స్ మీటింగ్‌లో పాల్గొనేందుకు కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పోలీస్ సెక్యూరిటీ స్నిఫర్ డాగ్ ‘లూసి’ గౌరవ వందనం చేసింది. ఆయన దానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఆకట్టుకుంటోంది. కాగా ఈ జాగిలం పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రావీణ్యం పొందింది.
News December 7, 2024
కడప జిల్లాలో వరుస హత్యలు
కడప జిల్లాలో వారం వ్యవధిలో 4 హత్యలు జరిగాయి. నవంబర్ 30వతేదీన పులివెందులలో కొడుకును తండ్రి హత మార్చాడు. డిసెంబర్ 2న ప్రొద్దుటూరులో రౌడీషీటర్, అదే రోజు దువ్వూరులో మద్యానికి బానిసై వేధిస్తున్న కుమారుడిని తండ్రి రోకలిబండతో చంపాడు. నిన్న చక్రాయపేట మండలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరు కన్నుమూశారు. ఈ వరస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.