News April 26, 2024
ఈతకు వెళ్లి తండ్రి, కోడుకులు మృతి

యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని రాయిపల్లికి చెందిన బోడ నరేష్ ఆయన కుమారుడు సాయికుమార్‌తో కలిసి మోటకొండూరు మండలంలోని చాడ గ్రామం బంధువుల ఇంట్లో ఎల్లమ్మ పండుగకు వెళ్లారు. పండుగ అనంతరం పిల్లలకు ఈత నేర్పించడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు నీట మునిగి నరేష్, సాయికుమార్, మృతి చెందారు.
Similar News
News April 14, 2026
ఎంజీయూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల విడుదల

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 113 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. గతంలో వీరికి సంబంధించిన ఏజెన్సీ సుమారు 99 లక్షల రూపాయల జీఎస్టీ బకాయి పడటంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో స్తంభించిన వేతనాల చెల్లింపునకు ప్రత్యామ్నాయంగా మరో ఏజెన్సీ ద్వారా నిధులు విడుదల చేస్తూ వర్సిటీ యంత్రాంగం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.
News April 14, 2026
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రావద్దు: కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని స్పష్టం చేశారు.