News April 24, 2025
ఈతకు వెళ్లి బీఫార్మసీ విద్యార్థి మృతి

నెల్లూరు జిల్లాలో చదువుకుంటున్న అనంతపురం యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందాడు. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన అంజి నార్త్ రాజుపాలెంలోని వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సమీపంలోని రేగడిచిలక వద్ద బావి దగ్గరికి ఐదుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బావిలో మునిగి చనిపోయాడు.
Similar News
News March 16, 2026
నేటి నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని పశుసంవర్థక శాఖ జేడీ ప్రేమ్‌చంద్ తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పశువులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాకు 3.20 లక్షల మందు డోసులు సరఫరా అయ్యాయని, ప్రతి గ్రామంలోని పశువులకు ముందస్తుగా టీకాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News March 16, 2026
వైభవంగా ముగిసిన గుత్తి కోట ఉత్సవాలు

జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక ఫుట్‌బాల్ క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, దగ్గుపాటి వెంకటప్రసాద్ పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ చాటిన కళాకారులకు వీరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఉత్సవాలు విజయవంతం కావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
News March 15, 2026
ATP: ఈనెల 16న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గ విజన్ యూనిట్లలో విజయవాడలో నిర్వహించే 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.


