News September 10, 2025
ఈనెల 12న జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు

ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 12న ఉదయం 10 గంటలకు ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని జిల్లా పరిషత్ CEO శ్రీహరి మంగళవారం తెలిపారు.
Similar News
News December 7, 2025
కొవ్వూరు బీజేపీలో ఆధిపత్య పోరు

కొవ్వూరు BJPలో ఆధిపత్య పోరు ఉందని ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పరిమి రాధాకృష్ణ మధ్య సఖ్యత లోపించిందని క్యాడర్ గుసగుసలాడుతోంది. తాజాగా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో రెండు హాల్టుల పునరుద్ధరణపై ఇరువురు నేతలు తమ మద్దతుదారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణకు మారుపేరైన BJPలో ఇలాంటి పరిస్థితి ఏంటని కార్యకర్తలు వాపోతున్నారు.
News December 7, 2025
ఏకగ్రీవ పంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్: కలెక్టర్ తేజస్

సూర్యాపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసేవరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలలో సైతం ఈ కోడ్ తప్పనిసరిగా అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
News December 7, 2025
కర్నూలు: ‘స్క్రబ్ టైఫస్.. వ్యాధి కాదు’

స్క్రబ్ టైఫస్ వ్యాధి కాదని, మనిషి నుంచి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై వైద్య బృందంతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని, అందరికీ చికిత్స అందించామని, 39 మంది రోగులను డిశ్చార్జ్ చేశామని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు వివరించారు.


