News November 7, 2025
ఈనెల 12న RUకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక: వీసీ

ఈ నెల 12న రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాన్వకేషన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ వెంకట బసవరావు వెల్లడించారు. శుక్రవారం యూనివర్సిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది స్కాలర్లకు కాన్వకేషన్ పట్టాలు, 18,396 మందికి ఓడీ ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు.
Similar News
News January 23, 2026
అంగన్‌వాడీ సేవలు మెరుగుపరచాలి: కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డా.సిరి సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు మెరుగైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు. పథకాల అమలులో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
News January 23, 2026
ఫిబ్రవరి నాటికి పనులు ప్రారంభం కావాలి: కలెక్టర్

పెండింగ్‌లో ఉన్న పీఎం కుసుమ్ పనులను ఫిబ్రవరి మొదటి వారం నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి విద్యుత్ శాఖ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కాంట్రాక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఏప్రిల్ నాటికి 23,000 సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు.
News January 23, 2026
పర్యావరణ పరీక్షకు 782 విద్యార్థుల గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పర్యావరణ విద్య పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆర్ఐఓ లాలప్ప తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా మొత్తంగా 26,465 హాజరు కావలసి ఉండగా.. 25,683 విద్యార్థులు హాజరయ్యారన్నారు. 782 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. పరీక్షను ఇంటర్ బోర్డు ఆర్జేడీ (కడప) డాక్టర్ సురేశ్ బాబు పర్యవేక్షించారు.


