News December 13, 2025

ఈనెల 14 నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు: CMD

image

ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని శనివారం కోరారు. కళాశాల విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.

Similar News

News January 13, 2026

15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

image

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

News January 12, 2026

VZM: ‘పీజీఆర్ఎస్‌ని ప్రజలు వినియోగించుకోవాలి’

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News January 11, 2026

VZM: ఆకాశమే హద్దు.. పతంగులతో పిల్లల ఆటలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకొని పిల్లల్లో పతంగులు ఎగరవేయాలనే ఉత్సాహం పెరిగింది. రంగురంగుల పతంగులు, మాంజా దారాల కొనుగోలులో పిల్లలు బిజీగా ఉన్నారు. మైదానాలు, ఇంటి టెర్రస్‌లు పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. గాజు మాంజా వాడకూడదని విజయనగరం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. విద్యుత్ తీగల దగ్గర పతంగులు ఎగరవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.