News December 14, 2025
ఈనెల 15న యథావిధిగా PGRS: కలెక్టర్

డిసెంబర్ 15 సోమవారం జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అర్జీదారులు తమ వినతులను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Similar News
News January 23, 2026
తూ.గో: ఉద్యోగాలకు 57 మంది ఎంపిక

కర్ణాటక రాష్ట్రం హోసూరు ప్రాంతంలోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మొబైల్ ఆపరేటర్ పోస్టులకు తూ.గో జిల్లాకు చెందిన 57మంది ఎంపికయ్యారని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈ అవకాశాలను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 23, 2026
తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
News January 23, 2026
ప్రాథమిక రంగ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం: ఇన్ఛార్జి కలెక్టర్

తూ.గో జిల్లాలో ప్రాథమిక రంగంలో పరిశ్రమలను నెలకొల్పేలా ఔత్సాహికులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వై.మేఘ స్వరూప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖలు పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లను.. పశుసంవర్ధక శాఖ డైరీ, పాల ఉత్పత్తులకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్లను ప్రోత్సహించాలన్నారు.


