News April 12, 2024

ఈనెల 16న PUలో మహనీయుల జయంతి

image

ఈనెల 16న పాలమూరు విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా. నాగం కుమారస్వామి తెలిపారు. వర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, భారత రత్న డా. బీఆర్. అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా పులే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 10, 2025

MBNR: పల్లె బాట పట్టిన పట్టణవాసులు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రేపు గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదు, ముంబై వలస వెళ్లిన కార్మికులు తిరిగి తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులలో రద్దీ గణనీయంగా పెరిగింది. కొందరు సొంత వాహనాలతో తమ గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో 44వ జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.

News December 10, 2025

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

image

నిష్పక్షపాతంగా ప్రతి అధికారి విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి బుధవారం సూచించారు. రేపు మొదటి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలని, ఎల్లప్పుడూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ ఉండాలని సూచించారు.

News December 10, 2025

మహబూబ్‌నగర్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. గండీడ్ మండలం సల్కర్‌పేటలో అత్యల్పంగా 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిడ్జిల్ మండలం దోనూరులో 9.3, మిడ్జిల్‌లో 10.1, కోయిలకొండ సిరి వెంకటాపురం, భూత్‌పూర్‌లో 10.5, దేవరకద్రలో 10.9, కొత్త మొల్గ‌రలో 11.4, జానంపేటలో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.