News September 10, 2025

ఈనెల 17 నుంచి వైద్య శిబిరాలు: కలెక్టర్

image

మహిళల ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యవంతంగా, బలంగా నిలుస్తుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్వాస్థ్‌ నారీ శ్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు ఉంటాయన్నారు.

Similar News

News December 12, 2025

జనగామ: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి!

image

2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించే జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 641 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నారు. దీంతో పరీక్షను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.

News December 12, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

నార్కట్ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్ఐ
నల్గొండ: జిల్లాలో బ్యాలెట్ పత్రాల కలకలం
నల్గొండ: సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నకిరేకల్: అటవీశాఖ అధికారులకు గుడ్లగూబ అప్పగింత
చండూరు: కస్తాలలో సిపిఐ బలపరిచిన అభ్యర్థి గెలుపు
కట్టంగూర్: వార్షిక వేడుకలకు నిష్కలంక మాత ఆలయం సిద్ధం
శాలిగౌరారం: 22 ఏళ్లకే ఉపసర్పంచిగా ఎన్నిక
నిడమనూరు: విధులు బహిష్కరించిన న్యాయవాదులు

News December 12, 2025

పొందూరు ఖాదీకి GI ట్యాగ్‌ గుర్తింపు

image

పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మక GI ట్యాగ్‌ లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు X వేదికగా ప్రకటించారు. ఇది శ్రీకాకుళం నేతకార్మికుల వారసత్వానికి లభించిన అపూర్వ గౌరవమని తెలిపారు. గాంధీజీకి ప్రియమైన పొందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్ర ఉందని, ఎన్నో కష్టాల మధ్య ఈ కళను కాపాడిన నేతకార్మికులే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. GI ట్యాగ్‌తో ఖాదీ మార్కెట్‌ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.