News October 5, 2025
ఈనెల 19న బాపట్లలో షాపింగ్ ఫెస్టివల్: కలెక్టర్

బాపట్లలో ఈ నెల 19న షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు రకాల వస్తు ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రతి పాఠశాలలో 40 నిమిషాల పాటు సూపర్ GSTపై తరగతులు నిర్వహించాలని DEOను ఆదేశించారు. ట్రేడర్స్ అసోసియేషన్లు ప్రజకు GSTపై అవగాహన కల్పించాలన్నారు. ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయాలని GST నోడల్ అధికారి యశ్వంత్ ఆదేశించారు.
Similar News
News January 24, 2026
కెనడాను చైనా మింగేస్తుంది: ట్రంప్

చైనాతో వ్యాపారం చేస్తే కెనడాకే ప్రమాదమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు మద్దతివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తోంది. నిజానికి అది వారి దేశాన్ని కూడా రక్షిస్తుంది. దానికి బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకే మొగ్గు చూపుతోంది. నిజానికి కెనడాని చైనా ఏడాదిలోనే మింగేస్తుంది’ అని పేర్కొన్నారు.
News January 24, 2026
పారిశ్రామిక అభివృద్ధికి భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టీజీఐఐసీ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు భూసేకరణ పూర్తయిన భూముల రికార్డు మ్యాపులను సిద్ధం చేయాలని చెప్పారు. రైతులకు చెల్లించిన పరిహారం వివరణపై పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు.
News January 24, 2026
కామారెడ్డి: జిల్లాలో ‘బీసీ’లకే అగ్రపీఠం!

పురపాలక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు ప్రాధాన్యత లభించింది. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు జిల్లాలో బీసీల రాజకీయ ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో మూడు స్థానాలను బీసీలకు కేటాయించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో రాజకీయంలో అనుభవం ఉన్న ఆశావాహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.


