News September 10, 2025
ఈనెల 23 నుంచి సింహాచలంలో శరన్నవరాత్రులు

సింహాచలంలో శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్ర ఉత్సవములు ఈనెల 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగనున్నాయిని ఈ.ఓ వేండ్ర త్రినాథరావు బుధవారం తెలిపారు. ప్రతిరోజూ విశేష ఉత్సవములు, రామాయణ పారాయణం, సాయంత్రం బేడా తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. OCT 02న విజయదశమి సందర్భంగా శమీపూజ మహోత్సవం, పూలతోటలో జమ్మి వేటతో జరుగుతాయన్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు దర్శనం కల్పిస్తామన్నారు.
Similar News
News December 12, 2025
మన జిల్లాను టాప్ టెన్‌లో నిలిపేలా కృషి చేయాలి: నంద్యాల కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సర్వీసుల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ సీఎస్ విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల జిల్లా అన్ని పారామీటర్లలో రాష్ట్రంలో టాప్ టెన్‌లో నిలిపేలా కృషి చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
News December 12, 2025
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: శ్రీశైలం ఎమ్మెల్యే

ఈనెల 12న ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలిపారు. 10 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాను వినియోగించుకోవాలని కోరారు. https://naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చన్నారు.
News December 12, 2025
జట్టులో సూర్య, గిల్ అవసరమా?

T20ల్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నా కెప్టెన్, వైస్ కెప్టెన్ అనే కారణంతో సూర్య, గిల్ కంటిన్యూ అవుతున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గత 14 T20ల్లో గిల్ 263 పరుగులే చేశారని, అటు తన చివరి 20 మ్యాచుల్లో SKY కేవలం 227 రన్సే కొట్టారని చెబుతున్నారు. వీళ్ల కోసం ఫామ్‌లో ఉన్న శాంసన్, జైస్వాల్ బలవుతున్నారని SMలో పోస్టులు పెడుతున్నారు. వీరిని టీం నుంచి తొలగించాలనే డిమాండ్లు విన్పిస్తున్నాయి. దీనిపై మీ COMMENT.


