News August 23, 2025
ఈనెల 25న డీఎస్సీ అభ్యర్థుల వెరిఫికేషన్: DEO

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, మూడు గెజిటెడ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాలి. ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్లను https:/apdsc.apcfss.in అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News January 23, 2026
భూమనపై రమణ విమర్శలు

విజయసాయిరెడ్డి నమ్మినవారికి వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడని, దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని టీటీడీ మాజీ సభ్యుడు ఓ.వి.రమణ ఆరోపించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. భూమన కరుణాకర్ రెడ్డి కరుణానంద స్వామిలా మారి శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి YCPకి రాజీనామా చేయడం జగన్ ఆడుతున్న డ్రామా అని, BJPలో చేరి కూటమిని విచ్ఛిన్నం చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.
News January 23, 2026
2 వారాలు షుగర్ మానేస్తే మ్యాజిక్ రిజల్ట్స్!

స్వీట్లు, కూల్ డ్రింక్స్ వంటి వాటిలోని చక్కెర మన బాడీని పాడు చేస్తోందని ఎయిమ్స్ డాక్టర్ సౌరభ్ సేథి చెప్పారు. కేవలం 14 రోజులు షుగర్ మానేస్తే అద్భుతమైన మార్పులు వస్తాయన్నారు. ‘ముఖంలో వాపు తగ్గి గ్లో వస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ తగ్గి పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది. ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మాయమవుతాయి. హెల్తీ స్కిన్ కోసం ఇదో బెస్ట్ టిప్’ అని సూచించారు.
News January 23, 2026
ఫిబ్రవరి నాటికి పనులు ప్రారంభం కావాలి: కలెక్టర్

పెండింగ్‌లో ఉన్న పీఎం కుసుమ్ పనులను ఫిబ్రవరి మొదటి వారం నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి విద్యుత్ శాఖ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కాంట్రాక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఏప్రిల్ నాటికి 23,000 సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు.


