News October 6, 2025
ఈనెల 5 నుంచి అవగాహన సదస్సులు: మేడ్చల్ కలెక్టర్

సమాచార హక్కు చట్టం-2005 వారోత్సవాల్లో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జిల్లా, డివిజన్, మండల స్థాయి కార్యాలయాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మనూ చౌదరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అన్ని ఆఫీసుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు.
Similar News
News January 17, 2026
ప్రేమను పెంచే సింపుల్ ట్రిక్!

దంపతుల మధ్య చిలిపి తగాదాలు, ఒకరినొకరు ఆటపట్టించుకోవడం వల్ల వారి బంధం మరింత బలపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సరదా టీజింగ్స్.. భాగస్వాముల మధ్య ఉన్న భయాన్ని పోగొట్టి, చనువును పెంచుతుంది. ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, గొడవలను కూడా నవ్వుతూ పరిష్కరించుకోవచ్చు. అయితే ఈ హాస్యం కేవలం ఆనందం కోసమే ఉండాలి తప్ప, అవతలి వ్యక్తిని కించపరిచేలా ఉండకూడదు. share it
News January 17, 2026
కాకినాడలో పవన్ ‘న్యూ లుక్’

జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సరికొత్త వేషధారణతో అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈనెల 9న పిఠాపురం, కాకినాడ పర్యటనలో ప్యాంటు, స్వెటర్ ధరించి సాదాసీదాగా కనిపించిన ఆయన, శనివారం గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రం పూర్తి ‘స్మార్ట్’ లుక్‌లో విచ్చేశారు. గడ్డం ట్రిమ్ చేసుకొని, సంప్రదాయ కుర్తా పైజామాలో మెరిసిపోతున్న పవన్‌ను చూసి అభిమానులు జేజేలు పలికారు.
News January 17, 2026
విధుల్లో చేరిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం ఉదయం విధుల్లో చేరారు. ఇవాళ తన కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. అద్దంకి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణులై 2009లో అద్దంకి ఎమ్మార్వోగా పనిచేసిన పులి శ్రీనివాసరావు పని చేశారు. ఇటీవల నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.


