News October 5, 2025
ఈనెల 6న ఉమ్మడి ప.గో జిల్లా స్థాయి ఎంపికల పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని స్కూల్ యాజమాన్యాల అండర్-14, 17 వయసున్న బాల, బాలికల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. ఈనెల 6న తైక్వాండో, హ్యాండ్ బాల్ పోటీలను ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్విటేషన్ ఫామ్‌లో ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరిగా ఉండాలన్నారు.
Similar News
News January 24, 2026
ఫిరంగిపురంలో చెత్త సంచిలో చిన్నారి

ఫిరంగిపురంలో కనిపించిన ఈ దృశ్యం నిజంగానే గుండెను బరువెక్కించేలా ఉన్నాయి. ‘లోకమంతా బడి బాట పడుతుంటే.. ఈ చిన్నారి మాత్రం చెత్త సంచిలో’ ఒదిగిపోయాడు. రిక్షా వెనుక వేలాడుతున్న ఆ సంచే ఆ పసివాడికి ఊయల అయ్యింది. రేపటి పౌరుడిగా ఎదిగాల్సిన వయసులో, చెత్త కుప్పల మధ్య తన భవిష్యత్తును వెతుక్కుంటున్న ఆ చిన్నారి చూపులు సమాజాన్ని నిలదీస్తున్నట్లుగా ఉన్నాయి.
News January 24, 2026
విశాఖ: చదువుకున్న వారే మోసపోతున్నారు..

చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులే ఉన్నారు. తాజాగా నగరంలోని ఓ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి సైబర్ ముఠా రూ.10 లక్షల వరకు కాజేశారు. ఈ కేసులో విశాఖ సైబర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వరంగల్ ప్రాంతానికి చెందిన రమేశ్, పరుశురాములు, నిశాంత్ కలిసి ఓ వ్యక్తి అకౌంట్ తీసుకుని సైబర్ క్రైమ్ ముఠాకు కమిషన్ రూపంలో అప్పజెప్పినట్లు దర్యాప్తులో తేలింది.
News January 24, 2026
రానున్న 24 గంటల్లో వర్షాలు

AP: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, 2-3డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పింది. మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్లూరి (D) జి.మాడుగులలో 6.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


