News October 5, 2025

ఈనెల 7న ఉమ్మడి జిల్లాల స్కూల్ గేమ్స్ ఎంపికలు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్ 14 అండర్ 17 బాల బాలికల స్కూల్ గేమ్స్ ఎంపికలను ఈనెల 7న నిర్వహిస్తున్నామని స్కూల్ గేమ్స్ కార్యదర్శులు డి.సునీత, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు శనివారం తెలిపారు. టేబుల్ టెన్నిస్, మాల్కంబ్, లాన్ టెన్నిస్ ఎంపికలను వీరవాసరం ఎంఆర్‌కె జడ్పీ హైస్కూల్, చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హైస్కూల్, బీమవరం టౌన్ హల్, పాలకొల్లులో జరుగుతాయన్నారు.

Similar News

News January 19, 2026

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News January 18, 2026

బధిరుల క్రీడల్లో ‘పశ్చిమ’ ప్రభంజనం.. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

image

హర్యానాలో జరిగిన రాష్ట్రస్థాయి బధిరుల క్రీడా పోటీల్లో ప.గో. జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానం సాధించారని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి 600 మంది పాల్గొన్న ఈపోటీల్లో, జిల్లా నుంచి వెళ్లిన 16 మంది ప్రతిభ కనబరిచారన్నారు. విజేతలను ఆదివారం భీమవరంలో ఘనంగా అభినందించారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణించడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.