News December 2, 2025
ఈనెల 7న జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్ష: కలెక్టర్

జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షలు ఈ నెల 7వ తేదీన జరుగుతాయని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు.
ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి నాలుగేళ్ల పాటు సంవత్సరానికి రూ. 12,000 చొప్పున ఉపకార వేతనం లభిస్తుందని తెలిపారు.
Similar News
News February 13, 2026
ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్!

AP: చేనేతలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు శాసనమండలిలో వెల్లడించారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640, మర మగ్గం నేతన్నలకు రూ.21,600 ఆదా కానుందని మంత్రి చెప్పారు.
News February 13, 2026
మేడ్చల్: పురపోరులో ఎగిసిన ‘యువ’ కెరటాలు

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఐదుగురు యువ కౌన్సిలర్లు గెలుపొందారు. 7వ వార్డు నుంచి బందేల కుమార్, 8వ వార్డు లావుడ్య శ్రీదేవి, 11వ వార్డు గోషిక అఖిల, 18వ వార్డు ఓం ప్రకాశ్ గౌడ్, 10వ వార్డు నిరుగంటి శ్రీలత గెలుపొందారు. 24 మంది కౌన్సిలర్ అభ్యర్థులలో ఐదుగురు యువ నాయకులు ప్రజాప్రతినిధులుగా గెలుపొందడం మేడ్చల్ మండల చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ ఐదుగురు BRS పార్టీ నిలబెట్టినవారే.
News February 13, 2026
కానిస్టేబుల్ సస్పెండ్.. గెలిచిన భార్య!

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో సస్పెండైన కానిస్టేబుల్ భార్య గెలిచారు. సిద్దిపేట(D) చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో BRS తరఫున గీతాంజలి పోటీ చేశారు. ఆమె భర్త రమేశ్ కొమురవెళ్లి PSలో కానిస్టేబుల్. ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు వెళ్లడంతో విధుల నుంచి రమేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.


