News October 7, 2025

ఈనెల 9న వైఎస్ జగన్ రోడ్ షో?

image

ఈనెల 9న వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా 7నియోజకవర్గాల మీదుగా రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్‌డ్రగ్ పార్క్ బాధితులను జగన్ కలవనున్నారని చెప్పారు. ఆయన పర్యటనకు సంబంధించిన సన్నాహక సమావేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు.

Similar News

News January 16, 2026

గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడి గెలుపు

image

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్ MH ‘జల్నా’ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,621 ఓట్ల మెజారిటీతో గెలిచారు. BJP సహా ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. 2018లో అరెస్టై, 2024 సెప్టెంబర్‌లో కర్ణాటక హైకోర్టు నుంచి పంగర్కర్ బెయిల్ పొందారు. గతంలో అవిభక్త శివసేనలో కార్పొరేటర్‌గా పనిచేశారు.

News January 16, 2026

గద్వాల్: మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

image

మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో 2026- 2027 విద్యా సంవత్సరంలో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు.

News January 16, 2026

చనాక-కోరట ప్రాజెక్టు.. 51 వేల ఎకరాలకు సాగునీరు

image

దిగువ పెనుగంగపై తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దున చనాక-కోరట ప్రాజెక్టును నిర్మించారు. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని ప్రాజెక్టు పనులను మొదలుపెట్టారు. 0.98 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో ప్రాజెక్ట్, దాని సమీపంలో హత్తి ఘాట్ వద్ద పంపు హౌస్ నిర్మించారు. దీని ద్వారా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలలోని సుమారు 51 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.