News September 12, 2024

ఈస్ట్ కోస్ట్ రైల్వే సరకు రవాణాలో బెంచ్ మార్క్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే సరకు రవాణాలో కొత్త బెంచ్ మార్కులు నమోదు చేసుకుంది. 160 రోజుల్లో 100 మిలియన్ టన్నుల సరకును అన్‌లోడ్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సరకు రవాణాలో 6.5% వృద్ధి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కొత్త రోడ్ డివిజన్లో 60.38 మిలియన్ టన్నులు, సంబల్పూర్ డివిజన్లో 17.382లో సరకు రవాణా చేసినట్లు వివరించారు.

Similar News

News October 10, 2024

బంతి పూల సొగసులతో..అరకు మరింత సోయగం

image

అరకులో జైపూర్ జంక్షన్ దగ్గర బోడ అనే రైతు బంతిపూల సాగుతూ ఒక సీజన్లో అత్యధిక రాబడిని పొందుతున్నాడు. టూరిస్టులు ఈ ప్రదేశంలో వచ్చి ఫోటోలు తీసుకోవడం వలన ఆ రైతుకు వచ్చే డబ్బు ఆధారంగా ఆదాయాన్ని పొందుతున్నాడు. ఆ పూల తోటలో ఫోటోలు తీసుకునే వారి వద్ద రూ.10 రూపాయల నుంచి రూ.30 వరకు టికెట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అరకు ప్రాంతంలో ఈ రకమైన పర్యటక వాణిజ్య వ్యవసాయం పట్ల రైతుల ఆసక్తి చూపెట్టడం గమనర్హం.

News October 10, 2024

పనుల్లో జాప్యం చేయవద్దు: కలెక్టర్

image

చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపుతూ పనుల్లో జాప్యం చేయడం సరికాదని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖ జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ గ్రామీణ పథకాలపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికయుతంగా పనిచేయాలన్నారు.

News October 9, 2024

విశాఖ నగరంలో ఏర్పాటు కానున్న TCS..ఎంపీ స్పందన

image

విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌కు విశాఖ ఎంపీ భరత్ శుభాకంక్షాలు తెలిపారు. ఈ మేరకు X వేదికగా స్పందిస్తూ టాటా గ్రూప్‌ను ఒప్పించారు. టీసీఎస్ ఏర్పాటు అయితే సుమారు పదివేల మంది స్థానిక యువతకి ఉపాధి లభిస్తుంది. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని చూపిస్తున్న చొరవకు ఎంపీగా అవసరమైనదంతా నేను చేస్తాను అని పేర్కొన్నారు.