News November 19, 2025

ఈ గణపతి రూపం బాధలను పోగొడుతుంది

image

10 చేతులు, 5 తలలు గల హేరంబ గణపతిని దర్శిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ గణపతిని ధ్యానించిన తర్వాతే పరమ శివుడు త్రిపురాసురుడుని సంహరించగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఫలితంగానే స్వర్గంలో ఇంద్రుడు సహా త్రిమూర్తులు తమ స్థానాల్లో ఉండగలిగారట. అందుకే గణపతికి తొలి పూజలు చేస్తారు. ఈయనను కొలిస్తే.. శుభాలు కలుగుతాయని, సంసార సాగరాన్ని సునాయసంగా దాటేయగలరని పండితులు చెబుతున్నారు.

Similar News

News January 22, 2026

కాకినాడ: ఇంటర్ పరీక్షలపై డీఆర్వో కీలక సూచనలు

image

ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్, పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో వెంకటరావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, 23 నుంచి మార్చి 24 వరకు వార్షిక పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.

News January 22, 2026

HEADLINES

image

* ‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CM CBN
* దావోస్‌లో కొనసాగుతున్న CM రేవంత్ టూర్
* అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్ రెడ్డి
* ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా: జగన్
* నైనీ కోల్ బ్లాక్ వివాదం.. రేవంత్‌తో బీజేపీ చీకటి ఒప్పందమన్న కేటీఆర్
* తొలి టీ20.. కివీస్‌పై భారత్ ఘన విజయం
* ఇవాళ 10గ్రా. బంగారం రూ.7వేలు, కేజీ వెండిపై రూ.5వేలు పెరిగిన ధర

News January 22, 2026

అభిషేక్… రికార్డులు షేక్

image

న్యూజిలాండ్‌తో తొలి T20లో అభిషేక్ శర్మ రికార్డ్ సృష్టించారు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు, 25 లేదా అంతకంటే తక్కువ బాల్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(8) చేసిన బ్యాటర్‌గా నిలిచారు. గతంలో సూర్య, సాల్ట్, లూయిస్‌తో(7 సార్లు) సంయుక్తంగా ఉన్న అభిషేక్ ఇవాళ వారిని అధిగమించారు. NZపై ఓ భారత్ బ్యాటర్ అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేయడంలోనూ ఘనత వహించారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో 50 కొట్టారు.