News April 11, 2024
ఈ నెలలోనే ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్: కలెక్టర్

ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ పకడ్బందీగా చేపట్టాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియపై అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్వోల బృందాలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ఈనెల 12, 13 తేదీలలో జరుగుతుందన్నారు.
Similar News
News March 22, 2025
గుంటూరు జిల్లాలో ఈగల్ తనిఖీలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులపై ఈగల్ సిబ్బంది దాడులను శుక్రవారం నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులు.. గుంటూరులో రెండు, తెనాలిలో షాపులను ఈగల్ సిబ్బంది సీజ్ చేశారు. ఈగల్ అధికారులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో తనిఖీలు కొనసాగుతాయని, డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు నిర్వహిస్తామన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
News March 22, 2025
గుంటూరులో రిమాండ్ ఖైదీ పరార్..!

మూత్రవిసర్జన ముసుగులో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోరీకేసులో నిందితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఖైదీని గుంటూరు జిల్లా జైలు నుంచి తీసుకెళ్ళి తెనాలి కోర్టులో హాజరుపర్చారు. తిరుగు ప్రయాణంలో గుంటూరు బస్టాండ్‌లో మూత్రవిసర్జన కోసం వెళ్లి ఖైదీ తిరిగి రాలేదు. దీంతో ఎస్కార్ట్ పోలీసులు కొత్తపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
News March 22, 2025
బ్రాడీపేటలో త్వరలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు: సజీల

గుంటూరు నగరంలో త్వరలో మోడల్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని నగర పాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ షేక్ సజీల తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవితో కలిసి బ్రాడీపేటలో పర్యటించారు. బ్రాడిపేట 4వ లైన్ 14 వ అడ్డరోడ్డులో ఫుడ్ కోర్ట్ ఉగాది లేదా శ్రీరామ నవమి నాటికిప్రారంభిస్తామన్నారు