News September 10, 2025

ఈ నెల 11న ఉద్యోగ మేళా

image

గణపవరంలోని శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. నిర్మల కుమారి మంగళవారం తెలిపారు. అపోలో ఫార్మసీ, బిట్స్ గ్రూప్, పేటీఎం గ్రూపుల్లో 100కు పైగా ఖాళీలున్నాయన్నారు. వీటి నియామకానికి 10వ తరగతి నుంచి డిగ్రీ చదివినవారు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకునే వారికి 28 ఏళ్ల లోపు వయసుండాలన్నారు. ఆసక్తి ఉన్నావారు కళాశాలలో సంప్రదించాలన్నారు.

Similar News

News December 14, 2025

నాగర్‌కర్నూల్‌ మండలంలో 85.1% పోలింగ్‌

image

నాగర్‌కర్నూల్‌ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85.1 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మొత్తం 18 పంచాయతీలకు గాను 29,282 మంది (పురుషులు 14,617, మహిళలు 14,665) ఓటు వేశారు. అత్యధికంగా నర్సాయిపల్లి గ్రామంలో 90.9 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News December 14, 2025

RR: ఆమనగల్లు(M) శంకరకొండ సర్పంచ్‌‌గా రాములు

image

ఆమనగల్లు మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శంకరకొండ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన రాములు 101 ఓట్లతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

News December 14, 2025

ఇంద్రానగర్ సర్పంచ్‌గా చిట్యాల దేవేంద్ర విజయం

image

తంగళ్ళపల్లి మండలం ఇంద్రానగర్ గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చిట్యాల దేవేంద్ర ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి దొగ్గల పద్మపై దేవేంద్ర గెలుపొందారు. ఈ సందర్భంగా దేవేంద్ర మాట్లాడుతూ.. ఈ గెలుపు తన వ్యక్తిగత విజయంగా కాకుండా ఇంద్రానగర్ గ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామస్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.