News September 10, 2025

ఈ నెల 11న కాకినాడలో జాబ్ మేళా

image

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 11న 220 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్, ఏటీఎం సంస్థలలో ఉద్యోగాల కోసం ఈ ఎంపిక జరుగుతుంది. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు, టెన్త్ నుంచి డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఉదయం 10 గంటలకు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు.

Similar News

News December 12, 2025

కొబ్బరికాయకు కుంకుమ పెడుతున్నారా?

image

హిందూ సంప్రదాయంలో పూజలు, శుభకార్యాలప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరిపై కుంకుమ బొట్టు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం శుద్ధత అని, దేవుడికి సమర్పించే ప్రసాదం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలని అంటున్నారు. తెల్లటి గుజ్జుపై కుంకుమ ఉంచడం వల్ల తినదగిన నైవేద్యం స్వచ్ఛత దెబ్బతింటుందని, కావాలంటే పీచుపై పెట్టాలని సూచిస్తున్నారు.

News December 12, 2025

టీడీపీలో చేరి కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక

image

కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమెకు ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ వసంత బాబు నియామక పత్రం అందజేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గౌతమి.. బుధవారం టీడీపీలో చేరారు. 24 మంది కౌన్సిలర్లకు గాను 22 మంది హాజరయ్యారు. ఇద్దరు గైరాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులిద్దరితో కలిపి 13 మంది గౌతమికి ఓటు వేయడంతో గెలుపొందారు.

News December 12, 2025

నేడు విశాఖలో 9 IT సంస్థల క్యాంపస్‌లకు భూమిపూజ

image

AP: కాగ్నిజెంట్, సత్వా గ్రూప్‌తో పాటు విశాఖలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్‌ల నిర్మాణాలకు నేడు CM CBN, మంత్రి లోకేశ్ భూమిపూజ చేయనున్నారు. మధురవాడలో 1.టెక్ తమ్మిన, 2.నాన్ రెల్ టెక్నాలజీస్, 3.ACN ఇన్ఫోటెక్, కాపులుప్పాడలో 4.ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, 5.ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, 6.మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, 7.క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రై. లిమిటెడ్ సంస్థలకు శంకుస్థాపనలు జరగనున్నాయి.