News August 11, 2025

ఈ నెల 17న గుంతకల్లుకు సినీ నటి అనసూయ రాక

image

ఈ నెల 17న తాను గుంతకల్లుకు వస్తున్నట్లు సినీ నటి అనసూయ వెల్లడించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉదయం 11 గంటలకు ఓ షాప్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. గుంతకల్లుకు రానుండటం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. అభిమానులతో కలిసి అలరించనున్నట్లు చెప్పారు.

Similar News

News March 16, 2026

వయసుల వారీగా పిల్లలకు వేయించాల్సిన టీకాలు

image

* 24 గంటలు- BCG, హెపటైటిస్ B
* 6 వారాలు- OPV-1, RVV-1, FIPV-1, పెంటా-1, PCV-1
* 10 వారాలు- OPV-2, RVV-2, పెంటా 2
* 14 వారాలు- OPV-3, RVV-3, FIPV-2, పెంటా3, PCV2
* 9-12 నెలలు- MR1, JE1, FIPV3, PCV-B
* 16-24 నెలలు- MR2, JE2, OPV బూస్టర్, DPT 1
* 5-6 ఏళ్లు- DPT-2
* 10 ఏళ్లు TD-1 బూస్టర్; * 16 ఏళ్లు TD2 బూస్టర్
* 14ఏళ్ల బాలికలకు HPV
(నేడు నేషనల్ వ్యాక్సినేషన్ డే)

News March 16, 2026

తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకు కేడీసీసీబీ బ్యాంక్

image

కరీంనగర్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏటా వంద కోట్ల లాభలతో ప్రభుత్వ ప్రధాన బ్యాంకులకు ధీటుగా సేవలు అందిస్తూ తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకి ఎంపికైనట్లు సీఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ ఆవార్డును 17వ తేదిన సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందని, ఇది అందరి సమిష్టి విజయం అని తెలిపారు.

News March 16, 2026

మెదక్: తీవ్ర విషాదం.. పరీక్షకు వెళ్తూ మృతి

image

మనోహరాబాద్ మండలంలో ఆదివారం <<19387134>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఓ కంటైనర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇమాంపూర్ వాసి నిఖిల్(20) అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు మన్నె స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు బైక్‌పై ఉప్పల్‌లో పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.