News December 3, 2025

ఈ నెల 6 నుంచి ANU యువజన ఉత్సవాలు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా 2025-2026 యువజన ఉత్సవాలు ఈనెల 6, 7, 8 తేదీలలో జరుగుతాయని యువజన ఉత్సవాల కోఆర్డినేటర్‌ మురళీమోహన్‌ తెలిపారు. మ్యూజిక్, డాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు ఉంటాయని చెప్పారు. వర్సిటీలోని కళాశాలలతో పాటు, అనుబంధ కళాశాల విద్యార్థులు యువజన ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు.

Similar News

News February 9, 2026

ఏలూరు: ‘మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టారు’

image

‘మీసాలపై నిమ్మకాయలు నిలబెడతాం’ అనే నానుడిని జీలకర్రగూడేనికి చెందిన బాహుబలేంద్రుని బాలవర్ధిరాజు అక్షరాలా నిజం చేసి చూపించారు. సినీ నటుడైన ఆయన, వృత్తిరీత్యా పొడవాటి మీసాలు పెంచడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. భారీ మీసాలను మెలితిప్పి, వాటిపై నిమ్మకాయలను నిలబెట్టి చూపిస్తున్న ఆయన విన్యాసం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 1958లో శివాజీ గణేశన్ నటించిన ‘వీరప్రతాప 1940’ సహా పలు చిత్రాల్లో నటించారు.

News February 9, 2026

శ్రీకాకుళం: టెన్త్ విద్యార్థులకు గమనిక

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఎగ్జామ్స్‌లో ఓ పరీక్ష తేదీని మార్చినట్లు డీఈవో రవి కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిషు పరీక్ష, ఆ రోజు రంజాన్ కావడంతో మరుసటి రోజు 21న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మార్పును టీచర్లు, విద్యార్థులు గమనించాలన్నారు.

News February 9, 2026

ఈనెల 11న టెక్కలిలో మెగా జాబ్ మేళా

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 11న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయిబాబు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18-35 ఏళ్లలోపు వయసున్న యువతీయువకులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.